తెలంగాణ

telangana

ETV Bharat / city

"సుగంధ' బోర్డు కార్యాలయాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ..." - పథకాల్లో అవినీతి ప్రచారం దుర్మార్గమైన చర్య: తెరాస ఎంపీలు

నిజామాబాద్‌కు సుగంధ ద్రవ్యాల బోర్డు కార్యాలయాన్ని స్వాగతిస్తున్నామని తెరాస పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావు తెలిపారు. అయితే.. వరంగల్‌లో ఉన్న బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌కు తరలించొద్దని పేర్కొన్నారు. దిల్లీలో తెరాస లోక్​సభా పక్షనేత నామ నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

trs mps meeting in delhi
trs mps meeting in delhi

By

Published : Feb 5, 2020, 3:01 PM IST

Updated : Feb 5, 2020, 3:13 PM IST

పథకాల్లో అవినీతి ప్రచారం దుర్మార్గమైన చర్య: తెరాస ఎంపీలు

తెలంగాణ సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారమే లేదని కేకే తెలిపారు. సాంకేతికతను వినియోగించి మోసాలకు వీలు లేకుండా చేశామని చెప్పారు. సంక్షేమ పథకాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా ఆధార్‌ను లింక్​ చేశామని పేర్కొన్నారు.

పథకాలను ఆపేందుకు కుట్ర; నామ

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఆపాలనని భాజపా ఎంపీలు చూస్తున్నారని నామ ఆరోపించారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పథకాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పథకాల ద్వారా ఆధార్ డేటా తీసుకుంటున్నామని అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రెండు పథకాల్లో మోసాల్లేవని కేంద్రమే చెప్పిందని గుర్తు చేశారు.

ఇవీ చూడండి:'స్పైస్​ బోర్డు కాదు... పసుపు బోర్డు కావాలి'

Last Updated : Feb 5, 2020, 3:13 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details