TRS MPs met Piyush Goyal: వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో చర్చించేందుకు తెరాస ఎంపీలు, మంత్రులకు అపాయిమెంట్ ఫిక్సయింది. ఈ మేరకు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్.. వారికి అపాయిమెంట్ షెడ్యూల్ ఖరారు చేశారు. రేపు ఉదయం 11.40 గంటలకు తనను కలవాల్సిందిగా సమాచారం అందించారు.
దిల్లీ కేంద్రంగా వరిపోరును అధికార తెరాస మరింత ఉద్ధృతం చేసింది. ఇప్పటికే హస్తిన చేరుకున్న మంత్రులు కేంద్రంపై ఒత్తిడి పెంచే కార్యచరణను ముమ్మరం చేసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే తెరాస ఎంపీలు.. ఉదయం రాజ్యసభ లాబీలో కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. ధాన్యం సేకరణపై కేంద్రమంత్రితో ప్రస్తావించిన ఎంపీలు నలుగులు తెలంగాణ మంత్రులు దిల్లీకి వచ్చినట్లు తెలిపారు. అపాయింట్‌మెంట్ ఇవ్వాలని పీయూష్‌ని ఎంపీ కె.కేశవరావు కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి అపాయిమెంట్ ఇచ్చారు.