కేంద్ర పద్దుపై మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ స్పందించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ప్రకటించకపోవడం, నిధులు కేటాయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కన్నపేట రైల్వే ప్రాజెక్టు, సికింద్రాబాద్- కరీంనగర్ రైల్వే ప్రాజెక్టుపై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. మత్య్సకారులకు 'సాగర్ కాంత్రి' పేరుమీద నూతన పథకం తీసుకొచ్చారని.. కానీ తెలంగాణలో ఇప్పటికే ఉచిత చేపలు, గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎయిమ్స్, ఐఐటీపైనా ఎటువంటి ప్రస్తావన లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. అత్యధిక పర్యాటక కేంద్రాలున్న తెలంగాణ రాష్ట్రానికి నిధులు ప్రస్తావనే లేదన్నారు. ఈ పద్దుతో తెలంగాణపై భాజపా ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని అర్థమవుతుందన్నారు.
తెలంగాణపై సవతి తల్లి ప్రేమే చూపిస్తున్నారు: తెరాస ఎంపీలు - budget updates
కేంద్ర బడ్జెట్‌పై తెరాస స్పందించింది. రాష్ట్ర డిమాండ్లపై ఎన్నిసార్లు విన్నవించిన కనీస కేటాయింపులు చేయలేదన్నారు. కొత్త రాష్ట్రానికి చేయూతనందివ్వాల్సి ఉండగా.. సవతి తల్లి ప్రేమ చూపించినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణపై సవతి తల్లి ప్రేమే చూపిస్తున్నారు: కొత్త ప్రభాకర్
కేంద్ర పద్దులో అంకెల గారడీ తప్ప మరేమీ లేదని చెవేళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. సుస్థిరాభివృద్ధికి సంబంధించిన 16 అంశాల్లో తెలంగాణ ముందంజలో ఉన్నా.. అందుకు తగ్గ నిధులు ఇవ్వలేదన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అంకెల గారడి కాదు... పటిష్టమైన విధానాలు అమలు చేయాలని సూచించారు.