తెలంగాణ

telangana

ETV Bharat / city

అప్పుడే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటాయి: నామా

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎస్సీ,ఎస్టీ రిజర్వేషన్ల(సవరణ) బిల్లును తెరాస సమర్ధిస్తోందని ఎంపీ నామా నాగేశ్వర రావు లోక్​సభలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుండాలంటే.. అసెంబ్లీ తీర్మాణాలను కేంద్రం గౌరవించాలన్నారు.

By

Published : Dec 10, 2019, 6:13 PM IST

అప్పుడే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటాయి: నామా
అప్పుడే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటాయి: నామా

లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల సవరణ బిల్లుపై జరిగిన చర్చలో తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వర రావు కేంద్రాన్ని పలు సూటి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రాలు అసెంబ్లీలో చేసి పంపుతున్న కేంద్రానికి పంపుతున్న తీర్మాణాలను పట్టించుకోవట్లేదన్నారు. రాష్ట్ర తీర్మాణాలను కేంద్రం గౌరవిస్తేనే.. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు బాగుంటాయన్నారు.

అప్పుడే కేంద్ర రాష్ట్ర సంబంధాలు బాగుంటాయి: నామా

"ఎస్సీ, ఎస్టీ సవరణ బిల్లును తెరాస పూర్తిగా సమర్ధిస్తోంది. కానీ మంత్రి దీనిపై చివర్లో ఇంకాస్త వివరణ ఇవ్వాల్సి ఉంది. ఆర్టికల్​ 334 బిల్లులో ఎస్సీ ఎస్టీలతో పాటు ఆంగ్లో ఇండియన్లను ఇందులో చేర్చారు. భారత్​లో ఎస్టీ, ఎస్సీల జనాభా 25 కోట్లకు పైగా ఉంది. భారత స్వాతంత్ర్యం నుంచి 70 ఏళ్ల వరకు వారికి రిజర్వేషన్లు పెంచుతూ వచ్చాం. మళ్లీ పదేళ్లు పెంచారు. దీన్ని మేం సమర్ధిస్తున్నాం.

ఈ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీ రెజల్యూషన్​ చేసి కేంద్రానికి పంపింది. అసెంబ్లీలో రెజల్యూషన్​ చేసి కేంద్రానికి పంపి ఆరేళ్లవుతోంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధానికి కూడా లేఖలు రాసారు. రిజర్వేషన్లు అమలు చేస్తారా? లేదా? కేంద్రం సమాధానం చెప్పాలి. ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లపై కూడా కేంద్రానికి తీర్మానం పంపాం. రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానాలను కేంద్రం గౌరవించాలి. అప్పుడే కేంద్రం, రాష్ట్రాల సంబంధాలు బాగుంటాయి."

- నామా నాగేశ్వర రావు, తెరాస ఎంపీ

ఇదీ చూడండి: 'కశ్మీర్​ రాజకీయ నేతల విడుదల మా చేతుల్లో లేదు'

ABOUT THE AUTHOR

...view details