తెలంగాణ

telangana

By

Published : Mar 16, 2022, 8:53 PM IST

ETV Bharat / city

'తెలంగాణలో ఎరువుల కొరతను తీర్చాలి'

TRS Mps on Fertiliser: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలమగాణలో సాగు పెరిగిందని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష టన్నుల ఎరువు కొరత ఉందని... కేంద్రం వెంటనే అందించాలని కోరారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు పరిధిలోని జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరుచేయాలని తెరాస ఎంపీ పోతుగంటి రాములు కోరారు.

parliament
parliament

TRS Mps on Fertiliser: తెలంగాణలో ఎరువుల కొరతను తీర్చాలని కేంద్రప్రభుత్వాన్ని తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కోరారు. ఎరువుల కోసం పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. లోక్‌సభ శూన్యగంటలో మాట్లాడిన ఎంపీ ప్రభాకర్‌రెడ్డి... రాష్ట్రప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణలో సాగు పెరిగిందని సభ దృష్టికి తెచ్చారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో లక్ష టన్నుల ఎరువు కొరత ఉందని... కేంద్రం వెంటనే అందించాలని కోరారు. డిమాండ్‌ మేరకు మొత్తంగా 2లక్షల టన్నులను పంపించాలని కోరారు.

అక్షరాస్యతలో వెనుకబడిన నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు పరిధిలోని జిల్లాలకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరుచేయాలని తెరాస ఎంపీ పోతుగంటి రాములు కోరారు. లోక్‌సభలో మాట్లాడిన ఆయన... కేంద్రీయ విద్యాలయాలు లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలలకు వెళ్లి ఫీజులు కట్టలేక నిరుపేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

'తెలంగాణలో ఎరువుల కొరతను తీర్చాలి'

ఇదీ చదవండి :హైవేల విస్తరణకు నిధులిచ్చి పనులు చేపట్టట్లేదు: రేవంత్‌

ABOUT THE AUTHOR

...view details