తెలంగాణ

telangana

KK On BJP: 'భాజపాకు మేము ఎప్పుడూ వ్యతిరేకమే'

KK On BJP: సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గతంలోనే తాము తప్పుపట్టామని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే తెలిపారు. భాజపాకు తాము ఎప్పుడూ వ్యతిరేకమే అన్న కేకే.. దేశానికి మంచి జరిగే బిల్లులపై అంశాల వారీగానే మద్దతు ఇచ్చినట్లు చెప్పారు.

By

Published : Nov 30, 2021, 4:12 PM IST

Published : Nov 30, 2021, 4:12 PM IST

Updated : Nov 30, 2021, 4:19 PM IST

trs mp kk on bjp
trs mp kk

KK On BJP: 'భాజపాకు మేము ఎప్పుడూ వ్యతిరేకమే'

KK On BJP: భాజపాకు తాము ఎప్పుడూ వ్యతిరేకమేనని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు స్పష్టం చేశారు. దేశానికి మంచి జరిగే బిల్లులకే మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గతంలోనే తప్పుపట్టామని తెలిపారు.

తామూ గతంలో విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశామని.. కాంగ్రెస్​తో పాటు అన్ని పార్టీల నేతలు హాజరైనట్లు కేకే చెప్పారు. పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో అనుచిత ప్రవర్తన కారణంగా 12 మంది సభ్యులను ప్రస్తుత శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద విపక్షాలు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు.

KK On Paddy: రాష్ట్రంలోని యార్డుల్లో ధాన్యం నిండిపోయిందని.. వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులకు అపార నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్​ చేశారు. ధాన్యం సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలని.. ఎలాంటి వివక్ష ఉండకూడదని కోరారు. పంజాబ్​లో మొత్తం ధాన్యం సేకరించి తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించిన కేకే.. రెండు రాష్ట్రాలు ధాన్యం ఉత్పత్తిలో సమానంగా ఉన్నట్లు తెలిపారు. ఏడాది మొత్తం ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెప్పాలని.. ఏడాదికి నిర్దిష్ట ప్రణాళిక ఇస్తే దాని ప్రకారం రైతులను సన్నద్ధం చేస్తామన్నారు.

'శీతాకాల సమావేశాలు ముగిసే వరకు 12 మంది సభ్యులను సస్పెండ్ చేయడం సరికాదు. రైతు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని గతంలోనే తప్పుపట్టాం. ముమ్మాటికీ భాజపాను వ్యతిరేకిస్తున్నాం. గతంలో అంశాల వారిగానే బిల్లులకు మద్దతు ఇచ్చాం. ఏడాది మొత్తం ఎంత మొత్తంలో ధాన్యం సేకరిస్తారో చెప్పాలి. నిర్దిష్ట ప్రణాళిక ఇస్తే దాని ప్రకారం రైతులను సన్నద్ధం చేస్తాం. '

- కేకే, తెరాస పార్లమెంటరీ పార్టీ నేత

ఇదీచూడండి:Bandi sanjay: 'కేసీఆర్​ రైతు పక్షపాతి కాదు.. రైస్​మిల్లర్లకు సోపతి'

Last Updated : Nov 30, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details