తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కన్న కలలను.. సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని.. తెరాస సెక్రటరీ జనరల్, ఎంపీ కే.కేశవరావు అన్నారు. తెలంగాణ ప్రజలకు నేడు మరువలేని దినమన్నారు.
తెరాస ఆవిర్భవించి నేటికి 20 వసంతాలు పూర్తిచేసుకొన్న సందర్భంగా.. ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి కేకే పూలమాల వేశారు. అనంతరం గులాబీ జెండాను ఆవిష్కరించారు.