తనకు అప్పగించిన గురుతర బాధ్యతను నిష్టతో నెరవేరుస్తానని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. హైదరాబాద్‌లో పీవీ ఘాట్ వద్ద వాణీదేవి నివాళి అర్పించారు. పీవీ ఘాట్ నుంచి ప్రచారం ప్రారంభించి.. ఎన్నికల్లో గెలిచి అక్కడే విజయం సాధించినట్లు ధ్రువపత్రం పొందడం గొప్ప క్షణమని ఆమె అన్నారు.
పట్టభద్రులు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: వాణీదేవి - mlc surabhi vani devi
తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి
పట్టభద్రులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న ఎమ్మెల్సీ వాణీదేవి.. రాజకీయాలు తమ కుటుంబానికి కొత్త కాదని అన్నారు. తెలంగాణ బిడ్డ అయిన తండ్రి పీవీ నర్సింహారావుకు తెరాస ప్రభుత్వం ఎనలేని గౌరవాన్ని ఇస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నేతలు, ప్రజాప్రతినిధులకు వాణీదేవి ధన్యవాదాలు తెలియజేశారు.
- ఇదీ చదవండి :ఫలించిన గులాబీ దళపతి వ్యూహం.. ఇక దూకుడే!