ఒకటి, రెండు ఎన్నికల్లో గెలవగానే బండి సంజయ్ అడ్డు, అదుపూ లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని... తాము అంతకన్నా ఎక్కువగా మాట్లాడతామన్నారు. రాష్ట్రంలో భాజపా లేనే లేదని.. మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు.
కేసీఆర్‌ను జైళ్లో పెట్టే దమ్ము భాజపాకు ఉందా: పట్నం - బండి సంజయ్‌పై పట్నం మహేందర్ రెడ్డి ఆగ్రహం
రాష్ట్రంలో భాజపా లేనే లేదని... మూడేళ్ల తర్వాత గెలిచేది తెరాసేనని... ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్‌ను జైళ్లో పెట్టే దమ్ము భాజపాకు ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్‌ను జైళ్లో పెట్టే దమ్ము భాజపాకు ఉందా: పట్నం
వికారాబాద్ సభలో బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న మహేందర్ రెడ్డి... కేసీఆర్‌ను జైళ్లో పెట్టే దమ్ము భాజపాకు ఉందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌కు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని... తెరాస వ్యవహారం బండి సంజయ్‌కి ఎందుకని ప్రశ్నించారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్ రెడ్డి, మహేశ్ రెడ్డి హెచ్చరించారు.
ఇదీ చూడండి:హైకోర్టుకు వెళ్తుంటే.. కేకే కూతురు దాడి చేశారు : తహసీల్దార్