తెలంగాణ

telangana

ETV Bharat / city

TRS MLC Candidates: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్​ మార్క్​.. వీళ్లే ఫైనల్​..! - తెరాస అభ్యర్థుల లిస్ట్​

శాసనమండలి స్థానిక సంస్థల అభ్యర్థుల ఎంపిక(trs mlc candidates list in telangana 2021)లోనూ తెరాస తనదైన వ్యూహాన్ని అమలుచేసింది. సగానికి పైగా సిట్టింగ్ అభ్యర్థులను మార్చింది. సామాజిక, రాజకీయ పరిణామాలతోపాటు గతంలో ఇచ్చిన హామీలు, విధేయతకు కేసీఆర్​(cm kcr latest news) పెద్దపీట వేశారు. తెరాస అభ్యర్థుల(trs mlc candidates list in telangana 2021)కు.. నేడు జిల్లా మంత్రులు బీ ఫారాలు(b forms to mlc candidates) ఇవ్వనున్నారు.

trs mlc candidates final list for mlc elections telangana 2021
trs mlc candidates final list for mlc elections telangana 2021

By

Published : Nov 22, 2021, 5:00 AM IST

శాసనమండలి ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల ఎంపిక(trs mlc candidates list in telangana 2021)లో బండ ప్రకాశ్, వెంకట్రామిరెడ్డికి అనూహ్యంగా అవకాశం ఇచ్చిన తెరాస... స్థానికసంస్థల ఎన్నికల్లో(mlc elections in telangana 2021)నూ అదే తరహా వ్యూహాన్ని ప్రదర్శించింది. సమర్థత, సామాజిక, రాజకీయ సమీకరణలతోపాటు.. గతంలో ఇచ్చిన హామీలు, విధేయతకు గులాబీ దళపతి కేసీఆర్(cm kcr latest news) పెద్దపీట వేశారు. దిల్లీ వెళ్లే ముందు(cm kcr delhi tour) 12 మంది అభ్యర్థులను ఖరారు(trs mlc candidates list in telangana 2021) చేశారు. ఆయా జిల్లాల మంత్రులకు.. బీ ఫారాలు(b forms to mlc candidates) ఇవ్వడంతోపాటు.. నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. నేడు అభ్యర్థులకు జిల్లామంత్రులు బీ ఫారాలు ఇవ్వనున్నారు. ఎక్కువ శాతం అభ్యర్థులు ఇవాళే నామినేషన్లు దాఖలు చేయనుండగా.. మరి కొందరు రేపు దాఖలు చేసే అవకాశం ఉంది.

సగం మంది అభ్యర్థులకు నిరాశే..

స్థానికసంస్థల కోటాలో సగం మంది అభ్యర్థులకు నిరాశే మిగిలింది. ఆదిలాబాద్‌లో పురాణం సతీశ్‌కు అవకాశమివ్వకుండా ఆయన స్థానంలో దండే విఠల్‌ను ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్​...కూచిభట్ల దామోదర్ రెడ్డిని మార్చి గాయకుడు సాయిచంద్‌ను ఖరారుచేశారు. ఖమ్మంజిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణ స్థానంలో తాతమధుసూదన్‌ని ఎంపికి చేశారు. నల్గొండ జిల్లాలో గతంలో ఇచ్చిన హామీ మేరకు నాగార్జున సాగర్ నేత ఎమ్​సీ కోటిరెడ్డికి కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో.. సిట్టింగ్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి నిరాశ మిగిలింది. మెదక్‌జిల్లాలో గజ్వేల్‌కు చెందిన వైద్యుడు, పార్టీ సీనియర్ నేత డాక్టర్ యాదవరెడ్డిని బరిలోకి దించడంతో.. మండలి ప్రస్తుత ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అవకాశం కోల్పోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భానుప్రసాదరావుకు మరోసారి అవకాశం ఇచ్చిన తెరాస... మరో స్థానంలో సిట్టింగ్ అభ్యర్థి నారదాసు లక్ష్మణ రావు బదులుగా తెదేపా నుంచి తెరాసలో చేరిన ఎల్.రమణను బరిలోకి దించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి.... మరోసారి అవకాశం దక్కింది. నిజామాబాద్‌లో ఆకుల లలితకు అవకాశమివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. బండ ప్రకాశ్‌ మండలికి నామినేషన్ వేసినందున ఆ స్థానంలో కల్వకుంట్ల కవితను.... రాజ్యసభకు పంపించే అవకాశం కనిపిస్తోంది.

సునాయాసంగా గెలిచేస్తారు..

స్థానికసంస్థల కోటాలో విపక్షాలు పోటీ చేసినా తెరాస అభ్యర్థులు సునాయాసంగా గెలవడం లాంఛనం. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంండగా ఈ నెల 24న పరిశీలన.. 26 వరకు ఉపసంహరణకు గడువు ఉంది ఒకవేళ పోటీ అనివార్యమైతే డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి... డిసెంబరు 14న ఓట్లను లెక్కిస్తారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details