పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి కేబీఆర్ పార్క్‌లో ఓట్లు అభ్యర్థించారు. ఓటు హక్కు వినియోగించుకునేముందు విద్యావంతులు, మేధావులు ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. ఈ ప్రచారంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
'మన ఓటే.. మన భవిష్యత్‌ను మార్చే ఆయుధం' - trs mlc candidate surabhi vani devi
ఓటు హక్కు వినియోగించుకునే ముందు విద్యావంతులు, మేధావులు ఒకసారి ఆలోచించాలని రంగారెడ్డి-మహబూబ్‌నగర్-హైదరాబాద్ జిల్లా పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి సురభివాణీదేవి విజ్ఞప్తి చేశారు. ఓటు అనే ఆయుధమే రాబోయే తరాల తలరాతను మార్చుతుందని తెలిపారు.
'మన ఓటే.. మన భవిష్యత్‌ను మార్చే ఆయుధం'
విద్యారంగంలో ఉన్న అనేక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సురభివాణీదేవికి ఓటు వేసి గెలిపించాలని తలసాని కోరారు. ఒకసారి ఆమెకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 70 ఏళ్లలో లేని అభివృద్ధిని తెరాస ప్రభుత్వం వచ్చిన కొన్నేళ్లలోనే చేసి చూపించిందని, అందుకే తెరాస అభ్యర్థికి ఓటు వేసి ఘనవిజయం కట్టబెట్టాలని మంత్రి తలసాని అన్నారు.