తెలంగాణ

telangana

ETV Bharat / city

'కంటోన్మెంట్ స‌మ‌స్య‌ల‌పై సంజయ్ ఎప్పుడైనా మాట్లాడారా?' - సికింద్రాబాద్ కంటోన్మెంట్ తాజా వార్తలు

TRS MLA's FIRES ON BJP: కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో క‌లిపితే బాగుండునన్న ప‌రిస్థితి ఏర్పడింద‌ని తెరాస ఎమ్మెల్యేలు సాయ‌న్న, వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌లు ఆందోళ‌న వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రహదారులు మూసేయొద్దని చెప్పినా.. ఇక్కడి అధికారులు చాలా ఆంక్షలు విధిస్తున్నార‌ని ఆరోపించారు. ఇంకా ఎన్ని రోజులు మిలిటరీ, దేశం, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడుగుతార‌ని ప్ర‌శ్నించారు.

TRS MLA's FIRE ON BJP
తెరాస ఎమ్మెల్యేలు

By

Published : Mar 14, 2022, 11:03 PM IST

TRS MLA's FIRES ON BJP: కంటోన్మెంట్ ఏరియాని జీహెచ్ఎంసీలో కలిపితే మంచిగా ఉంటుందనే పరిస్థితి ఏర్పడిందని తెరాస ఎమ్మెల్యేలు సాయ‌న్న, వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం కాలం నుంచి ఉన్న రహదారులను మిలిటరీ వాళ్లు ఎందుకు మూసేస్తున్నారని అన్నారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రహదారులు మూసేయొద్దని చెప్పినా.. ఇక్కడి అధికారులు చాలా ఆంక్షలు విధిస్తున్నార‌ని ఆరోపించారు. బండి సంజయ్ ఎందుకు ఎంపీ అయ్యారో అసలు అర్థం కావడం లేద‌ని, ఒక పార్టీ అధ్య‌క్షుడిగా ఉండి ప‌రిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం చనిపోయిన సైనికులకు 10 లక్షల రూపాయల లెక్క‌న సీఎం ఇచ్చార‌న్నారు.

స్థానిక ప్రజల అభిప్రాయం తెలుసుకున్న త‌రువాత బండి సంజ‌య్ మాట్లాడితే బాగుంటుంద‌ని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ అన్నారు. చీకటి ఒప్పందంతో సంజ‌య్‌ ఎంపీ అయ్యార‌ని ఆరోపించారు. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నార‌ని ఆయన ధ్వజమెత్తారు. కంటోన్మెంట్​లో ప్రజలు నరకయాతన పడుతున్నార‌న్నారు. ఆ రోడ్లు నిజాం కాలం నుంచి ఉన్నాయ‌ని.. మిలిటరీ వచ్చినప్పుడు కాదని స్ప‌ష్టం చేశారు. కంటోన్మెంట్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ఎప్పుడైనా కేంద్రం దగ్గర మాట్లాడారా.. అని నిల‌దీశారు. ఇంకా ఎన్ని రోజులు మిలిటరీ, దేశం, ధర్మం పేరు చెప్పి ఓట్లు అడుగుతార‌ని ప్ర‌శ్నించారు. కేసీఆర్ దీక్ష చేయకపోతే తెలంగాణ వచ్చేదా.. సంజయ్​ పార్టీ అధ్యక్షుడయ్యేవారా అని ధ్వజ‌మెత్తారు.

ఇదీ చదవండి:High Court On BJP MLA's: స్పీకర్‌ను కలవండి.. భాజపా ఎమ్మెల్యేలకు హైకోర్టు సూచన

ABOUT THE AUTHOR

...view details