తెలంగాణలో పార్టీ పెట్టడమే లక్ష్యంగా వైఎస్ షర్మిల ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా.. శనివారం ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం తెరాస ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు రవికాంత్... షర్మిలను కలిశారు.
వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు - trs mla's son met ys sharmila in Hyderabad
ఉమ్మడి రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లా నేతలతో శనివారం.. వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అనంతరం షర్మిలను తెరాస ఎమ్మెల్యే కాలే యాదయ్య కుమారుడు రవికాంత్ కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ షర్మిలను కలిసిన తెరాస ఎమ్మెల్యే కుమారుడు
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయాలు, పలు అంశాలపై ఎమ్మెల్యే కుమారుడితో షర్మిల చర్చించారు. తెరాస ఎమ్మెల్యే కుమారుడు వైఎస్ షర్మిలను కలవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.