తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్పత్రుల యాత్ర పేరుతో రాజకీయం: గొంగిడి సునీత

కాంగ్రెస్ నేతల ఆస్పత్రుల యాత్ర రాజకీయ లబ్ధి కోసమేనని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆరోపించారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని హైదరాబాద్​లో విమర్శించారు.

By

Published : Aug 26, 2020, 8:41 PM IST

trs mla gongidi sunitha fire congres and bjp in hyderabad
ఆస్పత్రుల యాత్ర పేరుతో రాజకీయం: గొంగిడి సునీత

విపక్షాలు ప్రగతి నిరోధకాలుగా మారారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మిమర్శించారు. కాంగ్రెస్ నేతల ఆస్పత్రుల యాత్ర రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం తెరాస సర్కారు.. విజన్ తో పనిచేస్తుంటే.. విపక్షాలు విధ్వంసం కోసం కంకణం కట్టుకున్నాయన్నారు.

ఇప్పటికైనా కాంగ్రెస్, భాజపా తీరు మారాలన్నారు. తెలంగాణ అప్పులు కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడే ఉన్నాయన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ.. దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.

ఇవీచూడండి:తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పీవీ బుక్ క్లబ్: కవిత

ABOUT THE AUTHOR

...view details