తెలంగాణ

telangana

ETV Bharat / city

'అమెరికాలో ఉన్న వ్యక్తి ఓటును భాజపా నేతలు వేశారు' - ghmc polls

అమెరికాలో ఉన్న వ్యక్తి ఓటును భాజపా నేతలు వేశారంటూ... రాజేంద్రనగర్ డివిజన్​లోని ఉప్పర్​పల్లిలో తెరాస కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలింగ్ బూత్-24లో రీపొలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు

trs leaders demanded for rajendra nagar repolling
trs leaders demanded for rajendra nagar retrs leaders demanded for rajendra nagar repollingpolling

By

Published : Dec 1, 2020, 8:52 PM IST

హైదరాబాద్​ రాజేంద్రనగర్ డివిజన్​లోని ఉప్పర్​పల్లి పోలింగ్​స్టేషన్-24లో భాజపా నాయకులు రిగ్గింగ్ చేశారని తెరాస వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇంద్రసేనా రెడ్డి అనే వ్యక్తి అమెరికాలో ఉన్నాడని... ఆ వ్యక్తి ఓటును ఇతరులు ఎలా వేస్తారంటూ తెరాస నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇలాంటివి ఎన్ని ఓట్లు వేశారోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి... నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉప్పరపల్లి పోలింగ్ బూత్-24లో రీపొలింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపేంత వరకు అందోళన చేపడుతమని తెరాస నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!

ABOUT THE AUTHOR

...view details