రాష్ట్రంలో ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేరని... అంశాలు లేవని తెరాస ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటున్నట్లు భాజపా గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.
వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా - telangana municipal elections
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భాజపాలకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు లేరని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్షాల నాయకత్వం సరైన దిశలో ఆలోచించట్లేదని ఆరోపించారు. రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంటున్నట్లు భాజపా గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

palla rajeshwar reddy
ఏటా పన్నుల రూపంలో రూ.65 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి కేవలం రూ.23 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి వస్తోందని వివరించారు.
వాళ్లకు అభ్యర్థులు లేరు.. అంశాలు లేవు: పల్లా
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: పురపోరుకు సిద్ధమైననేతన్నల ఖిల్లా... సిరిసిల్ల...