'కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారు.. జాగ్రత్త..' ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టచ్ చేస్తే.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాడి మసైపోతారని మాజీ మంత్రి, తెరాస నేత మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. దళితబంధుకు అడ్డుపడితే ప్రజలకు ఊళ్లలోకి రానివ్వరని మోత్కుపల్లి ధ్వజమెత్తారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలు చేయాలని.. దాని కోసం బండి సంజయ్ దిల్లీ, భాజపా పాలిత రాష్ట్రాల్లో డప్పు కొట్టాలన్నారు.
భాజపాకు వ్యతిరేకంగా డప్పుల దండోరా వేస్తామని తెలిపారు. నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఎందుకన్న మోత్కుపల్లి... రెండు కోట్ల ఉద్యోగాలను మోదీ ఇచ్చారా అని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో ఈటల కాంగ్రెస్ ఓట్లు కొని గెలిచారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకే నమ్మక ద్రోహం చేశారని దుయ్యబట్టారు.
కేసీఆర్ బాటే మీ మార్గం..
"సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతరా..? ఏది పంపు.. ఆయనను జైలుకు పంపుతే.. మీ ప్రభుత్వం ఏడుంటదో.. ఎట్లుంటదో మేమూ చూస్తం. పాలసీ పరంగా ముందుకు రమ్మంటే రారు. దేశం మొత్తం దళితబంధు, బీసీ బంధు అమలు చేయండి. కేసీఆర్ బాటే తప్ప.. మీకు వేరే మార్గమే లేదు. ఆయన సాకారం లేకుండా.. మీరు పరిపాలననే చేయలేరు. దళితజాతికి వ్యతిరేకమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. బుద్ధి తక్కువై నేనూ.. మీ పార్టీలో ఆరు నెలలు ఉన్న. మేథస్సు ఉన్న నాయకులెవరూ... మీ పార్టీలో ఉండరు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్, కాంగ్రెస్ అపవిత్ర కలయిక వల్ల గెలిచాడు. లేకపోతే గెలిచే పరిస్థితే లేదు. మూడు వేల ఓట్లు వస్తయా.. కాంగ్రెస్ పార్టీకి..? ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కు పడకుండా చూసిన గొప్ప నాయకుడు రేవంత్‌రెడ్డి. "- మోత్కుపల్లి నర్సింహులు, తెరాస నేత
ఇదీ చూడండి: