Mahila Bandhu Celebrations : తెరాస ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళాబంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేటీఆర్ నిర్దేశం మేరకు మహిళా దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో మహిళా దినోత్సవాన్ని తెరాస ఘనంగా నిర్వహించింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో పాటు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, షీ టీమ్స్, భరోసా కేంద్రాలు ఇలా ఎన్నో పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అండగా నిలిచారని మంత్రులు పేర్కొన్నారు.
మహిళలకు పెద్దపీట
తెరాస పాలనలో ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో మహిళా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో గాజులతో కేసీఆర్ చిత్రపటాన్ని రూపొందించి... మహిళలు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్ర మహిళల కోసం తీసుకొచ్చారని పువ్వాడ గుర్తుచేశారు. మహిళ సంక్షేమంలో రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
పోకిరీల ఆగడాలు తగ్గాయి