తెలంగాణ

telangana

ETV Bharat / city

'కార్యకర్తల కృషితో జాతీయ పార్టీలను ఢీకొని తెరాస అజేయ శక్తిగా ఎదిగింది' - కేటీఆర్ వార్తలు

కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. లక్షల మంది కార్యకర్తల శ్రమ, త్యాగాల వల్లే పార్టీ గొప్పగా కొనసాగుతోందని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉందని వెల్లడించారు. పార్టీ గౌరవాన్ని కాపాడే విధంగా కార్యకర్తలు నడుచుకోవాలని కోరారు.

ktr
ktr

By

Published : Aug 1, 2020, 4:12 PM IST

Updated : Aug 1, 2020, 5:43 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు ప్రమాద బీమా కోసం ఆ పార్టీ 16 కోట్ల 11 లక్షల రూపాయల వార్షిక ప్రీమియం చెల్లించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది కార్యకర్తల్లో ఎవరైనా... ప్రమాదంలో మరణిస్తే రెండు లక్షల రూపాయలు బీమా అందేలా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో తెరాస ఒప్పందం చేసుకుంది. కార్యకర్తల సంక్షేమం కోసం భవిష్యత్తులో పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్ల తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అజేయ శక్తిగా ఎదిగింది

పార్టీ ఆవిర్భావం నుంచి తెరాస కార్యకర్తలు ఎన్నో అవమానాలు, ఆటుపోట్లు, అవరోధాలను ఎదుర్కొని అధిగమించారని అన్నారు. పార్టీని చీల్చేందుకు కుట్ర పన్నారని.. జలదృశ్యం నుంచి గెంటివేసినప్పటికీ.. కార్యకర్తల కృషితో జాతీయ పార్టీలను ఢీకొని అజేయ శక్తిగా ఎదిగిందన్నారు. తెరాస కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు... కార్యకర్తలకు ఇబ్బంది వస్తే అండగా ఉండాలని.. ఇంటికి వెళ్లి తెలుసుకొని పార్టీ దృష్టికి తీసుకురావాలని చెప్పారు.

విమర్శించే ముందు ఆదుకోవాలి

తెరాసకు కర్త, కర్మ, క్రియ అన్నీ కేసీఆరేనన్నారు. పార్టీ స్థాపించిన ముహూర్త బలం, కేసీఆర్ సంకల్ప బలంతో తెరాస వందేళ్ల పాటు ఉండే పార్టీగా ఎదిగిందన్నారు. టీపీసీసీ, టీబీజేపీ నేతలకు పదవులు దక్కడం తెరాస పుణ్యమేనని కేటీఆర్ పేర్కొన్నారు. తెరాస కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం వల్లే ఆ పార్టీ నేతలకు గుర్తింపు లభించింద్నారు. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్, భాజపా నాయకులు కేసీఆర్​ను విమర్శించే ముందు ఆలోచించాలన్నారు.

అండగా నిలవండి

కరోనా సంక్షోభం సమయంలో తెరాస శ్రేణులు ప్రజలకు అండగా నిలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సహాయం చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున ప్రజల నిధులతో సాయం చేయడమే కాకుండా.. పార్టీ నుంచి కూడా అండగా ఉండేలా చూస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ఇటీవల తన జన్మదినం సందర్భంగా ఆరు అంబులెన్సులను తాను ఇవ్వడానికి సిద్ధపడగానే.. ముఖ్యనేతలందరూ స్పందించడంతో వందకు పైగా అంబులెన్సులు సమకూరాయని తెలిపారు.

దేశంలో ఏ పార్టీకి లేని పటిష్ఠమైన యంత్రాంగం తెరాసకు ఉంది: కేటీఆర్

ఇదీ చదవండి:ఈ నెల 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

Last Updated : Aug 1, 2020, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details