తెలంగాణ

telangana

ETV Bharat / city

ముఖ్యమంత్రిని కలిసి.. కృతజ్ఞతలు తెలిపిన తెరాస జిల్లా అధ్యక్షులు..

TRS District Presidents Met CM KCR: తెరాస జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. తమపై నమ్మకంతో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

TRS District presidents met CM KCR for convey Thanks
TRS District presidents met CM KCR for convey Thanks

By

Published : Jan 27, 2022, 9:30 PM IST

TRS District Presidents Met CM KCR: రాష్ట్రంలో కొత్తగా నియమింపబడ్డ తెరాస జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. మెదక్, సంగారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్​నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి, చింత ప్రభాకర్, జీవీ రామకృష్ణారావు, విద్యాసాగర్ రావు, కోరుకంటి చందర్, మాగంటి గోపీనాథ్, శంభీపూర్ రాజు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుసుమ జగదీష్, సంపత్ రెడ్డి, గండ్ర జ్యోతి, సి.లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కోనేరు కోనప్ప తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​ను కలిశారు. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు అధ్యక్షులతో ఉన్నారు.

TRS District Presidents: తెలంగాణ రాష్ట్ర సమితికి 33 జిల్లాల అధ్యక్షులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం(జనవరి 26) ప్రకటించారు. 19 జిల్లాలకు ఎమ్మెల్యేలను అధ్యక్షులుగా నియమించారు. మూడు జిల్లాలకు ఎంపీలు, రెండు జిల్లాలకు ఎమ్మెల్సీలను ఎంపిక చేశారు. మరో మూడు జిల్లాలకు జడ్పీ ఛైర్‌పర్సన్లు, ఒక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, ఇతర జిల్లాలకు పార్టీ సీనియర్‌ నేతలను నియమించారు. జిల్లా అధ్యక్షుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత నియమితులైన తొలి అధ్యక్షులు వీరే.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details