తెరాస ఫ్లీనరీలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి సహా నాయకులంతా అబద్దాలు, అవాస్తవాలను కలగలిపి అందమైన కథను తయారుచేసి ప్రజల ముందుపెట్టారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. ఏడేళ్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. దానిపై చర్చకు సిద్ధం కావాలని సూచించారు. అనేక వాస్తవాలను పుస్తక రూపంలో బయటకు తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మూడింతల వంతు నిరుద్యోగం పెరిగిపోయిందని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం ఖర్చు పెట్టిన సొమ్ము గుత్తేదారులకే ప్రయోజనం చేకూర్చిందన్నారని విమర్శించారు.
'తెలంగాణలో ఏడేళ్ల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. దానిపైన చర్చకు సిద్ధం కావాలి. ఇన్ని రోజులు రాష్ట్ర అభివృద్ధి కోసం అప్పుచేసింది. కానీ.. పోయిన సంవత్సరం నుంచి ప్రభుత్వాన్ని నడపడానికే అప్పు చేస్తోంది. ఏకంగా 16 వేల కోట్లు అప్పుతెచ్చి ప్రభుత్వాన్ని నడపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.'