రెండు వసంతాలు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) దిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోనుంది. గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ వెళ్లారు. కొందరు మంత్రులు సైతం ఇప్పటికే హస్తిన చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 01.48 గంటలకు దిల్లీలో తెరాస కార్యాలయ భవన నిర్మాణం కోసం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. వసంతవిహార్ మెట్రో స్టేషన్ సమీపంలో 1,300 గజాల స్థలాన్ని.. కేంద్ర ప్రభుత్వం కేటాయించింది.
CM KCR DELHI TOUR: దిల్లీకి చేరుకున్న కేసీఆర్.. రెండు రోజుల పాటు బిజీబిజీ!
పార్టీ కార్యాలయం శంకుస్థాపన కోసం తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ చేరుకున్నారు. రేపు మధ్యాహ్నం 01.48 గంటలకు వసంత విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో శంకుస్థాపన చేయనున్నారు.
పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రులు, తెరాస ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. శంకుస్థాపన అనంతరం అక్కడ జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు. హస్తిన పర్యటనలో కొంత మంది కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలిసే అవకాశం ఉందని అంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ రానున్నారు.
ఇదీచూడండి:CM KCR: మూడు రోజులు దిల్లీలోనే కేసీఆర్.. నేడే పయనం.. అందుకేనా?