trs candidates unanimous in mla quota mlc election శాసనమండలి ఎమ్మెల్యే కోటా(mla quota mlc election)లో ఆరుగురు తెరాస అభ్యర్థులు(trs mlc candidates 2021) నేడు ఏకగ్రీవం(trs mlc candidates unanimous)గా ఎన్నిక కానున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ సమయం ముగిశాక.. తెరాస అభ్యర్థులు ఏకగ్రీవం(trs mlc candidates unanimous)గా ఎన్నికైనట్టు లాంఛనంగా ప్రకటించి ధృవపత్రం ఇవ్వనున్నారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. గవర్నర్ కోటాలో నామినేట్ ఆయిన మధుసూదనాచారి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరిలలో ఒకరికి శాసన మండలి ఛైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. సుఖేందర్ రెడ్డి మాత్రం మంత్రి పదవిని ఆశిస్తున్నట్టు వినికిడి. బండ ప్రకాష్‌కు మండలి వైస్ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
అత్యంత వ్యూహాత్మకంగా..
ఉత్కంఠభరిత పరిణామాల మధ్య ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల(TRS Candidates For MLC) ను ప్రకటించారు. చివరి నిమిషంలో వెంకట్రామరెడ్డి, బండా ప్రకాశ్‌ల పేర్లు జాబితా (TRS Candidates For MLC)లో చేరాయి. అత్యంత వ్యూహాత్మకంగా.. పార్టీ సమీకరణాలకు అనుగుణంగా అభ్యర్థుల (TRS Candidates For MLC) ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలైన కడియం, గుత్తాల ప్రాధాన్యం దృష్ట్యా వారికి అవకాశం ఇచ్చారు. పార్టీ సేవలకు గుర్తింపుగా తక్కెళ్లపల్లి రవీందర్‌రావును ఎంపిక చేశారు. తనకు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డితో పాటు హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఎదుర్కొనేందుకు పార్టీ నేత కౌశిక్‌రెడ్డి పేర్లను జాబితాలో చేర్చారు. మండలిలో బలమైన బీసీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం కోసం రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యునిగా 2024 మార్చి వరకు ఆయన పదవీ కాలం ఉన్నా.. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడం గమనార్హం.
ఇవీ చూడండి: