'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయం' - ghmc elections news
బల్దియా సనత్‌నగర్ డివిజన్లో తెరాస ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. తెరాస అభ్యర్థి కొలను లక్ష్మీరెడ్డి తరఫున ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ప్రచారంలో పాల్గొన్నారు.

'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసదే ఘనవిజయం'
'జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాసదే ఘనవిజయం'
మతవిద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలను గ్రేటర్ ఎన్నికల్లో తరిమికొట్టాలని ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ సూచించారు. బల్దియా సనత్‌నగర్ డివిజన్ తెరాస అభ్యర్థి కొలను లక్ష్మీరెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెరాసను గెలిపించాలని కోరారు. ఆరేళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.