బల్దియా ప్రచారం రోజురోజుకు వెడెక్కుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, ప్రచార హోరుతో హైదరాబాద్ నగరం దద్దరిల్లుతోంది. కేపీహెచ్‌బీ నుంచి భాజపా నేత రాజాసింగ్ రోడ్ షో నిర్వహించారు. బాలాజీనగర్ డివిజన్ వద్దకు రాజాసింగ్ బృందం చేరుకోగానే.. అదే సమయంలో అటునుంచి వెళ్తున్న తెరాస నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.
రాజాసింగ్ రోడ్ షోలో భాజపా-తెరాస పోటాపోటీ నినాదాలు
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. కేపీహెచ్‌బీ కాలనీలో ప్రారంభమైన భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్‌షో.. బాలాజీనగర్ డివిజన్ వద్దకు చేరుకోగానే.. అదే దారిలో వచ్చిన తెరాస నాయకులు పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. భాజపా నేతలు వెనక్కి వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు.
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్
భాజపా నాయకులు వెనక్కి వెళ్లిపోవాలని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఒక్కసారిగా పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఈ క్రమంలో తెరాస, భాజపా కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. తెరాస, భాజపా కార్యకర్తలను ఆయా పార్టీల నాయకులు సముదాయించగా గొడవ సద్దుమణిగింది. ప్రచార సమయంలో వెనక్కి వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు నినాదాలు చేయడం సరికాదని పలువురు భాజపా నాయకులు అభిప్రాయపడ్డారు.