తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆ కూరగాయలను కుండీల్లో పెంచొచ్చా?

చిక్కుడు, సొర, బీర లాంటి తీగ జాతి కూరగాయలను కుండీల్లో పెంచుకోవచ్చా? ఎక్కువ దిగుబడి రావాలంటే ఏం చేయాలి? అని సందేహాలను ఉద్యాన నిపుణులు సూరం సింధూజ నివృత్తి చేశారు.

trips-for-grown-those-vegetables-in-pots-of-home
ఆ కూరగాయలను కుండీల్లో పెంచొచ్చా?

By

Published : Aug 16, 2020, 11:06 AM IST

చిక్కుడు, సొర, బీరతీగలను మిద్దెలపైనా, వరండాలో కుండీల్లో పెంచుకోవచ్ఛు అయితే వీటి పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఉద్యాన నిపుణులు సూరం సింధూజ అంటున్నారు. తీగజాతి కూరగాయలకు పెద్ద పరిమాణం, లోతు ఎక్కువగా ఉండే కుండీలు ఎంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఎర్రమట్టిని నింపాలి. కనీసం రెండు కిలోల వర్మికంపోస్టు నింపాలి. సాధ్యమైతే నత్రజని, భాస్వరం, పొటాషియం మిశ్రమాన్నీ కుండీకి 100 గ్రాముల వరకు మట్టిమిశ్రమంతో కలిపితేనే వాటికి కావాల్సిన బలం అందుతుందని ఆమె తెలిపింది.

తీగజాతి కూరగాయలను సంవత్సరం అంతా సాగు చేసుకోవచ్ఛు ఇవి విత్తనాల ద్వారానే పెరుగుతాయి. కుండీకి మూడు నాలుగు గింజలు నాటి, రెండు ముదురు ఆకులు వచ్చిన తర్వాత ఆరోగ్యంగా, బలంగా పెరిగే రెండు మొక్కలు ఉంచి మిగతా వాటిని తీసేయాలి. దేశవాళి/నాటు రకాలైతే చీడ, పీడలను తట్టుకుంటాయి. రుచిగా కూడా ఉంటాయి. కాయలు నాణ్యంగా రావడానికి సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని నాటిన 45 రోజుల తర్వాత పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగులు ఆశించకుండా పదిరోజులకొకసారి లీటరు నీటికి అయిదు గ్రాముల చొప్పున వేప నూనె పిచికారి చేయాలి. ఒకసారి కాపు/కాత మొదలైతే రెండు నెలల వరకు కాయలు కాస్తాయి. ఎంత ఎరువులు అందిస్తే అంత దిగుబడి ఉంటుందని ఉద్యాన నిపుణులు వివరించారు.

ఆ కూరగాయలను కుండీల్లో పెంచొచ్చా?

ఇదీ చూడండి:ఐఐటీ చదువు.. పొలంలో కొలువు

ABOUT THE AUTHOR

...view details