తెలంగాణ

telangana

By

Published : Nov 20, 2021, 7:43 PM IST

ETV Bharat / city

Chinna jeeyar swamy invites Jagan: సహస్రాబ్ధి ఉత్సవాలకు ఏపీ సీఎం జగన్​కు ఆహ్వానం

ఏపీ సీఎం జగన్​ను(chinna jeeyar swamy invites AP CM jagan).. త్రిదండి చినజీయర్‌స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఈ వేడుకలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

chinna jeeyar swamy invites CM jagan
సీఎం జగన్​, చినజీయర్​ స్వామి

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్​ రెడ్డిని త్రిదండి చినజీయర్‌ స్వామి(chinna jeeyar swamy invites CM jagan) మర్యాదపూర్వకంగా కలిశారు. రామానుజాచార్యులు అవతరించి వెయ్యేళ్లు అవుతున్న సందర్భంగా.. హైదరాబాద్‌ శివార్లలోని ముచ్చింతల్‌ ఆశ్రమంలో తలపెట్టిన సహస్రాబ్ది మహోత్సవాలకు రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు.

Chinna Jeeyar Swami: అందుకే రామానుజ సహస్రాబ్ది వేడుకలు.. మోదీ తప్పక వస్తారు

2022 ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు సహస్రాబ్ధి ఉత్సవాల(sahasrabdhi utsavalu) నిర్వహణ జరుగుతుందని చినజీయర్​ స్వామి(chinna jeeyar swamy) తెలిపారు. ఇందులో భాగంగా 1,035 కుండ శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకము, స్వర్ణమయ శ్రీరామానుజ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చినజీయర్‌ స్వామి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం.. చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

2022 ఫిబ్రవరి 5న ప్రధాని చేతుల మీదుగా రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ(ramanuja charyula Idolatry) చేయనున్నట్లు త్రిదండి చినజీయర్‌స్వామి ఇదివరకే ప్రకటించారు. ఫిబ్రవరి 2-14 వరకు సమతామూర్తి కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఫిబ్రవరి 14న పూర్ణాహుతిలో రాష్ట్రపతి పాల్గొంటారన్నారు.

అతిపెద్ద పంచలోహ విగ్రహం

రామానుజాచార్యులు సమ సమాజ స్థాపనకు పూనుకున్నారని చినజీయర్ స్వామి అన్నారు. శ్రీరామానుజాచార్యులకు వెయ్యేళ్లు పూర్తయ్యాయని... సమతా సిద్ధాంతాన్ని రామానుజులు లోకానికి చాటారని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. రూ. 1200 కోట్లకుపైగా వ్యయంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద పంచ లోహ విగ్రహం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. 120 కిలోల బంగారంతో నిత్యారాధాన విగ్రహం ఏర్పాటు చేస్తామని.. 12 రోజులు రోజుకు కోటిసార్లు నారాయణ మంత్రం పఠనం ఉంటుదన్నారు. కార్యక్రమంలో 5వేల మంది రుత్వికులు పాల్గొంటారని... 128 యాగశాల‌ల్లో హోమం చేస్తామన్నారు. 1017లో రామానుజాచార్యులు అవతరించి 121 ఏళ్లపాటు భూమిపై ఉన్నారని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.

ప్రముఖుల హాజరు

శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్​తో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు త్రిదండి చినజీయర్​ స్వామి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేదాల్లో కృషి చేసిన వారిని అవార్డులతో సత్కరిస్తామని తెలిపారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వేదాలను చదివిన వ్యక్తి ప్రభావం ఆ ప్రాంతమంతా విస్తరించి ఉంటుందని... దీంతో ఆ పరిసరాలు పునీతం అవుతాయని త్రిదండి చిన్నజీయర్ స్వామి పేర్కొన్నారు. అందుకే ప్రతి దీపావళికి వేదాల్లో కృషి చేసిన వారిని, వేదాల్లో అనుభవం గడించిన వారిని జీయర్ అవార్డ్ పేరిట సన్మానించుకుంటున్నామని తెలిపారు. 1994 నుంచి జీయర్‌ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ ఏడాది దిల్లీ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోపాల ప్రసాద శర్మకు అందించారు.

ఇదీచదవండి:Tridandi Chinajiyar‌swamy: 'సమాజానికి రామానుజాచార్యుల సమతా సిద్ధాంతం అత్యవసరం'

ABOUT THE AUTHOR

...view details