నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలోని విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద తూర్పు నౌకా దళం అమరవీరులకు అంజలి ఘటించింది. తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అమరవీరులకు నివాళులర్పించారు.
నౌకాదళ దినోత్సవం: విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు - విశాఖలో నౌకదళ దినోత్సవం
నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలోని విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద తూర్పు నౌకాదళం అమరవీరులకు నివాళులర్పించింది. ఉన్నతాధికారులు, నావికులు అంజలి ఘటించారు.
నౌకాదళ దినోత్సవం: విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు
నౌకాదళ ఉన్నతాధికారులు, నావికులు గౌరవ వందనం సమర్పించారు. జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ సృజన స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులర్పించారు.
ఇదీ చూడండి: ఎస్ఈసీ పార్థసారథి రాజీనామాకు బండి సంజయ్ డిమాండ్