తెలంగాణ

telangana

ETV Bharat / city

తెలుగు వారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్‌: ఉపరాష్ట్రపతి - ఎన్ట్​ఆర్​కు ప్రముఖుల నివాళులు

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వమని కొనియాడారు.

Tributes to NTR
Tributes to NTR

By

Published : May 28, 2022, 1:15 PM IST

Tributes to NTR: ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు. తెలుగువారు గర్వంగా చెప్పుకునే వ్యక్తి ఎన్టీఆర్‌ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎన్టీఆర్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం ఎన్టీ​ఆర్​ది అని కొనియాడారు. క్షేత్ర స్థాయిలో, అంత్యోదయ మార్గంలో సాగిన ఎన్టీఆర్ పరిపాలన, ప్రజా సంక్షేమమే పరమావధిగా ఆదర్శంగా నిలిచింది. ఆ మహా నాయకుని స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకుని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపారు.

ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా.. ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్ నివాళులర్పించారు. సీఎంగా ఎన్టీఆర్‌ సేవలను ట్విటర్‌ వేదికగా గవర్నర్ ప్రస్తావించారు.

ABOUT THE AUTHOR

...view details