మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. సత్యం, ధర్మం, అహింసా మార్గంలో పయనించి గాంధీ స్వాతంత్య్రం తీసుకువచ్చారని పోచారం అన్నారు.
'శాంతియుత మార్గంతోనే దేశానికి మేలు' - mahatma Gandhi death anniversary
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్ అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. బాపూజీ జీవిత భావాలను, చేసిన కృషిని స్మరించుకున్నారు.
అసెంబ్లీ ఆవరణలో గాంధీ వర్ధంతి
శాంతియుత మార్గంతోనే దేశానికి మంచి జరుగుతుందని నేతలు తెలిపారు. గాంధీ జీవిత భావాలను, చేసిన కృషిని, సాధించిన విజయాలను స్మరించుకున్నారు.