డా. బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలోని ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దళితుల కోసం అంబేడ్కర్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు.
దళితుల కోసం అంబేడ్కర్ కృషి ఎనలేనిది: పోచారం - అసెంబ్లీ ఆవరణలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు
రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని అసెంబ్లీ ఆవరణలో ఆయన విగ్రహానికి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాళులర్పించారు. పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
దళితుల కోసం అంబేడ్కర్ కృషి ఎనలేనిది: పోచారం
ఈ కార్యక్రమానికి మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మంత్రి ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇదీ చదవండి:'అంబేడ్కర్ కలలు కన్న దేశాన్ని నిర్మిస్తాం'