తెలంగాణ

telangana

ETV Bharat / city

SINGER SHANMUKHA PRIYA: 'ప్రేక్షకుల సపోర్ట్​ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను' - ap 2021 news

ఇండియన్ ఐడల్‌ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియను విశాఖలో కళా ప్రియులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె పాడిన పాటలు అందరినీ అలరించాయి.

SINGER SHANMUKHA PRIYA
SINGER SHANMUKHA PRIYA

By

Published : Sep 6, 2021, 1:49 PM IST

SINGER SHANMUKHA PRIYA: 'ప్రేక్షకుల సపోర్ట్​ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను'

ఇండియన్ ఐడల్‌ ఫైనలిస్ట్ షణ్ముఖ ప్రియను విశాఖలో కళా ప్రియులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె గానామృతంతో మంత్రముగ్దుల్ని చేసింది. షణ్ముఖ ప్రియ పాటలు వింటూ చిన్నా, పెద్దా అంతా ఆనందించారు. మేయర్​ హరి వెంకటకుమారి, జీసీసీ ఛైర్మన్‌ స్వాతిరాణి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్‌ ఆమెకు 'విశ్వగాన ప్రియ' అవార్డును ప్రదానం చేశారు.

తల్లిదండ్రుల సహకారం, విశాఖ వాసులు ఆదరాభిమానాల సహకారంతో జాతీయస్థాయిలో ప్రతిభ కనబరిచినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరు మామ, అంబటి రామకృష్ణ, ప్రతాప్‌, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

వైజాగ్​కు మళ్లీ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వారందరూ చాలా ఘనంగా నన్ను ఆహ్వానం పలికారు. విశ్వగాన ప్రియ అనే బిరుదు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. అభిమానుల సపోర్ట్​ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. భవిష్యత్​లోనూ ఇలానే ఆదరిస్తారని ఆశిస్తున్నాను. పొజిషన్​ కన్నా ప్రేక్షకుల ఆదరాభిమానాలే తనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయి.

షణ్ముఖ ప్రియ.

ఇదీచూడండి:తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ.. కోట్ల మనసుల్ని గెలిచింది!

ABOUT THE AUTHOR

...view details