తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!

అక్కడ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఎవరైనా అనారోగ్యం పాలైతే.. అంబులెన్సులు ఉండవు... స్థానికులు డోలీ కట్టాల్సిందే. రాళ్లు రప్పల మధ్య ఎక్కుతూ.. దిగుతూ బాధితులను మోసుకెళ్లాల్సిందే. తాజాగా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే.. డోలీలే వారికి అంబులెన్సులయ్యాయి.

By

Published : May 13, 2020, 4:22 PM IST

tribal struggles in vizag
డోలీ ఎక్కాల్సిందే!

విశాఖ మన్యంలో కొండవాలు మారుమూల ప్రాంతాల్లో రహదారి లేక రోగులు అవస్థలు పడుతున్నారు. అడుగు తీసి అడుగు వెయ్యాలన్నా.. రాళ్లు.. రప్పలే. మన్యంలో మంచాన పడిన వృద్ధులు.. ఆసుపత్రికి చేరాలంటే డోలీ మోత తప్పడం లేదు. గాలిలో దీపం పెట్టి బతుకు జీవుడా అంటూ.. ఆసుపత్రికి చేరుతున్నారు.

విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వంచేబు, బొడ్డాపుట్టులో ఇద్దరు అనారోగ్యం బారిన పడ్డారు. స్థానికులు అంబులెన్స్​కు ఫోన్ చేశారు. రెండు గ్రామాలు.. రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. రహదారి మార్గానికి తీసుకురావాల్సిందిగా అంబులెన్స్ సిబ్బంది స్థానికులకు తెలిపారు. ఇద్దరు రోగులను డోలీలో మోసుకుంటూ.. కొండ మార్గాన స్థానికులు రహదారి చేరుకున్నారు. అక్కడినుంచి వారిని జి.మాడుగుల ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ జి.మాడుగుల మండలం లువ్వాసింగి పంచాయతీ వంచేబు, సంగు లోయ బొడ్డా పుట్టు, గన్నెగుంట, చుట్టుగుమ్మి, బూసిపల్లి, పనసపల్లి , పెద్దగరువు తడ పాలెం, రాచకొండలో కనీస రహదారి మార్గాలు లేవు. ఏ అనారోగ్య సమస్య వచ్చినా ఇలా అవస్థలు పడాల్సిందే.

ఆసుపత్రికి వెళ్లాలంటే.. డోలీ ఎక్కాల్సిందే!

ఇదీ చదవండి: కరోనాతో భవిష్యత్తులో పిల్లలపైనే అధిక ప్రభావం!

ABOUT THE AUTHOR

...view details