తెలంగాణ

telangana

ETV Bharat / city

గిరిజనుల అభ్యున్నతికి కృషి: గవర్నర్ - tribal artists met governer

దిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడకలకు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన గిరిజనులతో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేశారు గవర్నర్. వారితో కలిసి నృత్యం చేశారు. మేడారం జాతరకు ఈ నెల 7న హాజరు కానున్నట్లు తెలిపారు.

గిరిజనులతో గవర్నర్ ఆటపాట
గిరిజనులతో గవర్నర్ ఆటపాట

By

Published : Feb 5, 2020, 11:41 AM IST

మేడారం జాతరకు 7వ తేదీన హాజరవుతానని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా దిల్లీలోని గణతంత్ర దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాల్లో రాష్ట్రం నుంచి 26 మంది గిరిజనులు హాజరయ్యారు.

కోయ, గోండి, బంజారా, తోటి, ప్రధాన్‌, డోలీ తదితర గిరిజన బృందాలను రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో గవర్నర్ కలిశారు. రేలా రే రేలా రాగంలో గుస్సాడి, కొమ్ముకోయ నృత్యాలను గిరిజన కళాకారులు ఆహుతుల్ని విశేషంగా ఆలరించారు.

గిరిజన కళాకారుల ప్రదర్శన తిలకించి ముచ్చపడ్డ గవర్నర్ తమిళిసై కూడా కళాకారులతో కలిసి కొంతసేపు నృత్యమాడారు.

రాష్ట్రంలో గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని... ఇది తన బాధ్యతగా తీసుకున్నానని భరోసా ఇచ్చారు. దిల్లీ పరేడ్​గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవం నాడు ఈ కళాకారులు ఇచ్చిన గుస్సాడి, కొమ్మకోయ నృత్య ప్రదర్శనలుకు బహుమతి లభించిందని కోయ గిరిజన అధ్యయన సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన అధ్యయన సంస్థ ప్రతినిధులు ప్రొఫెసర్ జి.మనోజ, సోయం సుగుణాబాయి, పద్దం అనసూయ, జల్లి దామయ్య తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులతో గవర్నర్ ఆటపాట

ABOUT THE AUTHOR

...view details