జేబీఎస్ - ఫలక్నూమ మార్గంలో త్వరలో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. నిర్మాణ పనులు పూర్తైన సందర్భంగా అధికారులు పూజలు నిర్వహించి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. మెట్రో ట్రయల్ రన్ ప్రారంభ వేడుకలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెట్రో రైలులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు.
అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు చేస్తం..
మొత్తం 11 కిలోమీటర్ల మార్గంలో 9 మెట్రో స్టేషన్లు ఉన్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ట్రయల్ రన్ సందర్భంగా అన్ని రకాల టెక్నికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సిగ్నలింగ్.. బ్రేక్ టెస్ట్ సిగ్నలింగ్, ప్రైమ్ కంట్రోల్, ఎలక్ట్రికల్ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడం వల్ల కొన్ని వారాల నిర్వహించి.. కమిషనర్ ఆఫ్ మెట్రో రైలు నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే ఈ మార్గాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ట్రయల్ రన్ విజయవంతం... త్వరలో పూర్తి సేవలు..! ఇదీ చూడండి: జేబీఎస్ - ఎంజీబీఎస్ ట్రయల్ రన్ విజయవంతం