తెలంగాణ

telangana

ETV Bharat / city

JAGAN CASES: సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌.. కౌంటర్​కు గడువు కోరిన సీబీఐ - డిశ్చార్జ్ పిటిషన్‌

గృహనిర్మాణ ప్రాజెక్టు కేసులో ఏపీ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. హైదరాబాద్​లోని నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్​ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

JAGAN CASES
సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌

By

Published : Sep 14, 2021, 10:59 PM IST

హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. లేపాక్షి కేసులో డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలకు సీబీఐ గడువు కోరింది. బి.పి.ఆచార్య, జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా పిటిషన్లపై కోర్టు విచారణను వాయిదా వేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కేసు విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

గృహనిర్మాణ ప్రాజెక్టు కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలకు సీబీఐ గడువు కోరింది. వాదనలు విన్న సీబీఐ కోర్టు.. గృహనిర్మాణ ప్రాజెక్టుల కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది. మరో వైపు విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాటానికి సీబీఐ గడువు కోరింది.

ఇదీ చదవండి:Minister Mallareddy: 'ఆ కామాంధున్ని విడిచిపెట్టేది లేదు.. ఎన్​కౌంటర్ చేయాలి..​ చేస్తం'

ABOUT THE AUTHOR

...view details