తెలంగాణ

telangana

ETV Bharat / city

రెవెన్యూ డే గా ప్రకటించాలంటూ ట్రెసా విజ్ఞప్తి - ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి

ఏకకాలంలో ధరణి పోర్టల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందుబాటులోకి రావడం, డిజిటల్‌ సాంకేతికతతో భూ దస్త్రాలు, భూ పరిపాలన ప్రారంభం కావడం పట్ల తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) హర్షం వ్యక్తం చేసింది.

Telangana revenue day
తెలంగాణ రెవెన్యూ డే

By

Published : Oct 30, 2020, 9:16 AM IST

ధరణి పోర్టల్‌ ప్రారంభించిన రోజును భూ హక్కుల పరిరక్షణ దినం/ రెవెన్యూ డేగా ప్రకటించాలని సీఎంకు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, కె.గౌతంకుమార్‌ విజ్ఞప్తి చేశారు. దేశంలోనే రెండు రకాల సేవలను ఒకే పోర్టల్లో అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని, పటిష్ఠమైన చట్టం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

పోర్టల్‌ ప్రారంభ కార్యక్రమం అనంతరం సీఎం వారిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారికి బొటనవేలు చూపి(డన్‌) మీరు సాధించారు.. అంటూ అభినందించారు. కొత్తచట్టం అమల్లో చిత్తశుద్ధితో పనిచేయాలని కేసీఆర్‌ సూచించగా విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని వారు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details