తెలంగాణ

telangana

ETV Bharat / city

రాత్రంతా రోడ్డుపైనే కరోనా రోగి.. పట్టించుకోని ఆస్పత్రి - పశ్చిమ గోదావరి జిల్లా తణుకు

ఆపదలో ఆదుకోవాల్సిన వైద్యులు ఓ కరోనా బాధితుడ్ని నిర్ధాక్షిణ్యంగా నిరాకరించిన ఘటన ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగింది. ఫలితంగా బాధితుడు రాత్రంతా ఆస్పత్రి సమీపంలోని రోడ్డు మీదే నిద్రించాడు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

రాత్రంతా రోడ్డుపైనే కరోనా రోగి.. పట్టించుకోని ఆస్పత్రి
రాత్రంతా రోడ్డుపైనే కరోనా రోగి.. పట్టించుకోని ఆస్పత్రి

By

Published : May 9, 2021, 6:01 PM IST

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆస్పత్రిలో చేరడానికి వచ్చిన కరోనా రోగి రాత్రంతా రహదారిపైనే గడపాల్సి వచ్చింది. భీమవరం శివారు నాయుడుపేటకు చెందిన వ్యక్తికి కొవిడ్ వైరస్ సోకడంతో తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరేందుకు వచ్చాడు.

రాత్రంతా రోడ్డుపైనే..

రోగి పరిస్థితి సాధారణం కంటే భిన్నంగా ఉండటంతో ఆస్పత్రి సిబ్బంది చేర్చుకోలేదు. ఫలితంగా రోగి రాత్రి నుంచి తెల్లవారే వరకు సమీపంలోని సిల్వర్ జూబ్లీ రోడ్​పైనే దుప్పటి పరుచుకొని పడుకున్నాడు. చివరికి రోగి బంధువులు బాధితుడ్ని కాకినాడ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చూడండి :ఏ తల్లైనా.. బిడ్డ నుంచి ఆశించేది కాస్తంత ప్రేమే!

ABOUT THE AUTHOR

...view details