తెలంగాణ

telangana

ETV Bharat / city

నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..! - Indian Railways may hike passengers fare from February 1 ...

సంక్రాంతి పండుగకు ఊరెళ్లాలనుకుంటున్నారా.. రైలు ప్రయాణానికి సిద్ధమవుతున్నారా.. అయితే దయచేసి వినండి.. అదనపు బోగీలు వేయలేదు.. ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కలేదు.. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో సీట్లు ఖాళీ లేవు.. నెల రోజుల దాకా అన్ని రైళ్లకు నిరీక్షణ జాబితా కనిపిస్తోంది.. బోగీలలో కాలు మోపడానికి స్థలం లేదు.. మీరు ప్రత్యామ్నాయం చేసుకోండి.

traveling-traveling
నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!

By

Published : Dec 27, 2019, 5:20 AM IST

Updated : Dec 27, 2019, 7:15 AM IST

నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!
రైలు ప్రయాణమంటేనే జనం జంకుతున్నారు. పండుగకు సొంతూరు వెళ్లేందుకు.. రెండు నెలల ముందుగా రిజర్వేషన్‌ చేయించినా సీటు లభించని పరిస్థితి. మరోవైపు బస్సు ఛార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ప్రైవేటు వాహనాల ఛార్జీలు మధ్యతరగతి, సామాన్యుడికి భారంగా మారాయి. తత్ఫలితంగా ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

రిజర్వేషన్ ఫుల్​

సంక్రాంతి పండుగకు రెండు వారాలముందే ప్రయాణ ఇక్కట్లు మొదలయ్యాయి. అప్పుడే రైళ్లల్లో రిజర్వేషన్ టికెట్లు నిండుకున్నాయి. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంతా కన్పిస్తుంది. తాత్కల్​లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సొంతూళ్లకు వెళ్లాలనుకునేవారికి ఈసారి తిప్పలు తప్పేలాలేవు.

రైళ్లు పెరగవు.. సీట్లు దొరకవు
"హైదరాబాద్​ మహానగరంలో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తుంటారు. వీరిలో ఎక్కువ మంది రైలు ద్వారానే ప్రయాణం చేయాలనుకుంటారు. రైల్వే రిజర్వేషన్లు చేయించుకుందామనుకుని వెళ్లినవారికి నిరాశే ఎదురవుతోంది. ఏ రైలు చూసినా.. రిజర్వేషన్ ఫుల్ అనే చూపిస్తుందని ప్రయాణికులు వాపోతున్నారు"

అదనపు బోగీలేవీ..?

దక్షిణ మధ్య రైల్వే పండుగ సందర్భంగా 201 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రజా సంబంధాల ముఖ్య అధికారి రాకేష్ తెలిపారు. వాటిలో జనసాధరణ్ రైళ్లు, సువిధ రైళ్లు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల రద్దీని బట్టీ ప్రత్యేక రైళ్లను, కోచ్ లను పెంచుతామని పేర్కొన్నారు.

ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు..

చెన్నై, ఫలక్ నుమా, నారాయణాద్రి, ఎల్​టీటీ, విశాఖ ఎక్స్ ప్రెస్ లలో వెయిటింగ్ లిస్ట్ 200లకు పైగానే ఉన్నట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెంట్లు ఒక్కో టికెట్​పై సుమారు రూ.200ల నుంచి రూ.300ల వరకు తీసుకుంటున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అసలే పండుగ కచ్చితంగా ఇంటికి వెళ్లాల్సిందే.. ప్రయాణికుల అవసరాలను ప్రైవేట్ ఏజెంట్లు వ్యాపారంగా మలుచుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు.
"సంక్రాంతి పండుగ సందర్భంగా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు అదనపు కోచ్​లు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు"

రైళ్లలో భారీగా టికెట్ ఛార్జీలు పెంపు

  1. రైళ్లలో భారీగా టికెట్ ఛార్జీలు పెంచారు. జనవరి 10వ తేదీన రెగ్యులర్ రైలుకు, సువిధ రైలుకు మధ్య టికెట్ల ధర చూస్తే ఈవిషయం ఇట్టే అర్థమవుతుంది.
  2. కాచిగూడ-కాకినాడ మధ్య గౌతమి ఎక్స్​ప్రెస్ రైలు స్లీపర్ టికెట్ ధర రూ.345, థర్డ్ ఏసీ రూ.910, సెకండ్ ఏసీ రూ.1,285లు గా ఉంది.
  3. సువిధ రైలుకు రూ.1,185లు, థర్డ్ ఏసీ రూ.2,835, సెకండ్ ఏసీ రూ.3,205గా ఉన్నాయి.
  4. నర్సాపూర్-హైదరాబాద్​ల మధ్య నడిచే రైలులో నర్సాపూర్ ఎక్స్​ప్రెస్ కు స్లీపర్ టికెట్ రూ.265, థర్డ్ ఏసీ రూ.735, సెకండ్ ఏసీ రూ.1050లుగా ఉంది.
  5. సువిధ రైలుకు స్లీపర్ టికెట్ రూ.1,065లు, థర్డ్ ఏసీ రూ.2,055లు, సెకండ్ ఏసీ రూ.3,595లుగా ఉంది.

ఇవీ చూడండి:సంక్రాంతి కానుక... జనవరి 5 నుంచి 25 వరకు ప్రత్యేక రైళ్లు

Last Updated : Dec 27, 2019, 7:15 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details