ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఏజెన్సీలో డోలి కష్టాలు ఇంకా తీరడం లేదు. రోగులను ఆసుపత్రులకు తరలించేందుకు నానా ఇక్కట్లు పడుతున్నారు గిరిజనులు. హుకుంపేట మండలం శోభకోట పంచాయతీ కంగదువలో ఓ యువకుడు అనారోగ్యం బారిన పడ్డాడు. అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అంబులెన్స్‌కు ఫోన్ చేస్తే.. షరా మామూలే.. వచ్చేందుకు కదరదు. రహదారికి తీసుకురండంటూ సమాధానం.
అనారోగ్యానికి గురైతే..అంబులెన్స్ బదులు డోలి ఎక్కాల్సిందే - విశాఖలో డోలి కష్టాలు న్యూస్
విశాఖ ఏజెన్సీలో డోలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. ఊరు దాటాలంటే అంతే సంగతులు. అనారోగ్య సమస్య వస్తే.. అంబులెన్స్‌కు బదులు డోలి ఎక్కాల్సిందే. నానా కష్టాలు పడుతూ.. రహదారిపైకి వస్తేనే వారికి వైద్యం అందేది.
అనారోగ్యానికి గురైతే..అంబులెన్స్ బదులు డోలి ఎక్కాల్సిందే
యువకుడిని డోలిపైకి ఎక్కించి.. మూడు కిలోమీటర్ల మేర కొండ కోనల నుంచి మోసుకొచ్చి అవస్థలు పడ్డారు. అనంతరం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా.. గర్భిణులు, రోగులను ఇలాగే డోలిలో తీసుకెళ్లాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: ఏపీలో మాతృ మరణాలు తగ్గాయ్ : కేంద్రం