Telangana RTC News: తెలంగాణ ఆర్టీసీలో నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీలు), 11 మంది రీజినల్ మేనేజర్లను బదిలీ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆపరేషన్స్ ఈడీగా ఉన్న ఇ.యాదగిరి గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఈడీగా నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు కరీంనగర్ జోన్ ఈడీగా బదిలీ అయ్యారు. హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఈడీగా పనిచేస్తున్న పీవీ మునిశేఖర్ పరిపాలనా వ్యవహారాల ఈడీ, కార్పొరేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్టీసీ రెవెన్యూ, ఐటీ వ్యవహారాల ఈడీగా ఉన్న ఎ.పురుషోత్తంను హైదరాబాద్ జోన్ ఈడీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంజినీరింగ్ వ్యవహారాల ఈడీగా ఉన్న సి.వినోద్‌కుమార్‌కు అదనంగా ఉప్పల్, కరీంనగర్ వర్క్‌షాపుల బాధ్యతలు అప్పగించారు.
TSRTC News: ఆర్టీసీలో ఈడీలు, ఆర్‌ఎంల బదిలీలు.. ఉత్తర్వులు జారీ - ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
Telangana RTC News: టీఎస్ ఆర్టీసీ బదిలీల కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు(ఈడీలు), 11 మంది రీజినల్ మేనేజర్లను బదిలీ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ ఆర్టీసీ