రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్ల బదిలీ - additional collectors Transfers

09:05 March 27
రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్ల బదిలీ
రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ అదనపు కలెక్టర్ నరసింహారెడ్డి... మేడ్చల్‌కు, కుమురం భీం అదనపు కలెక్టర్ రాంబాబు నిర్మల్‌కు, జగిత్యాల అదనపు కలెక్టర్ రాజేశం కుమురం భీంకు, మహబూబాబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హైదరాబాద్‌కు, గద్వాల అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి నాగర్‌కర్నూల్‌కు, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి వరంగల్ అర్బన్‌కు బదిలీ అయ్యారు.
సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా మోహన్‌రావు, మెదక్ అదనపు కలెక్టర్‌గా జి.రమేశ్, జోగులాంబ గద్వాల అదనపు కలెక్టర్‌గా రఘురామ్ శర్మ, మంచిర్యాల అదనపు కలెక్టర్‌గా మధుసూదన్ నాయక్, వరంగల్ రూరల్ అదనపు కలెక్టర్‌గా బి.హరిసింగ్ నియమాకమయ్యారు.