తెలంగాణ ఏర్పడిన నాటితో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తిలో రెండింతల సామర్థ్యాన్నిపెంచుకున్నామని ట్రాన్స్ కో- జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. ప్రస్తుతం 16వేల మెగావాట్ల సామర్థ్యం కలిగి ఉన్నామని తెలిపారు.
'విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఎన్నో మైలురాళ్లు దాటాం' - telangana electricty generation and supply
గత ఆరేళ్లలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలో తెలంగాణ ఎన్నో మైలు రాళ్లను దాటిందని ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు
హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో నిర్వహించిన రాష్ట్ర ఇంధన పరిరక్షణ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రభాకర్ రావు పాల్గొన్నారు. గత ఆరేళ్లలో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీలో ఎన్నో మైలురాళ్లు దాటిందని తెలిపారు. యాదాద్రి, భద్రాద్రి ప్రాంతాల్లో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
- ఇదీ చూడండి :వెళ్లేవారు ఎంతమందో... వచ్చేవారూ అంతమందే