ఖాజీపేట-బళ్ళార్ష రూట్లో రాఘవపూర్-కొలనూర్ స్టేషన్ల మధ్య మూడో లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున... కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన రైళ్ల వివరాలను ఆధికారులు వెల్లడించారు. విశాఖపట్టణం-న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్-చప్రా ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ-ధనపూర్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్-నార్త్ పటేల్ నగర్ పార్శిల్ ఎక్స్ప్రెస్, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ-హజ్రత్ నిజాముద్దీన్ పార్శిల్ ఎక్స్ప్రెస్, త్రివేండ్రం-న్యూఢిల్లీ, కుద్రరోడ్-ఓకా ఎక్స్ప్రెస్, కుద్రరోడ్-అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్, సికింద్రాబాద్-యశ్వంత్పూర్, మైసూర్-జైపూర్, రేణిగుంట-హజ్రత్ నిజాముద్దీన్ దూద్ దురంతో రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
రాఘవపూర్-కొలనూర్ మధ్య లైన్ నిర్మాణ పనులతో రైళ్ల దారి మళ్లింపు - రాఘవపూర్-కొలనూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణం పనులు
రాఘవపూర్-కొలనూర్ రూట్లో రైల్వే లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున... కొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దారి మళ్లించిన సర్వీసుల వివరాలను అధికారులు వెల్లడించారు.

రాఘవపూర్-కొలనూర్ మధ్య లైన్ నిర్మాణ పనులతో రైళ్ల దారి మళ్లింపు
TAGGED:
trains diversion