ఆర్టీసీ సమ్మెకాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులకు ప్రత్యేక ఉద్యోగ కల్పన పథకం కింద ఉద్యోగాలు కల్పించారు. వీరికి ప్రత్యేక శిక్షణ తరగతుల్ని బస్‌భవన్‌లో ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మ ప్రారంభించారు. మరణించిన 38 మంది కుటుంబసభ్యులకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగాల్లో నియమించినట్లు తెలిపారు. విధి నిర్వహణలో మంచి ఫలితాలు తేవాలని అభ్యర్థులకు సూచించారు. కొత్తగా నియామకమైన 16 మంది జూనియర్ అసిస్టెంట్‌లకు 13 వారాలు, 12 మంది కండక్టర్లకు 3 వారాలు, 8 మంది సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కు 8వారాలు, ఇద్దరు శ్రామికులకు 2 వారాలు... టీఎస్‌ఆర్టీసీ శిక్షణా కళాశాలలు ట్రాన్స్‌పోర్ట్ అకాడమీ, జెడ్‌ఎస్‌టీసీలో శిక్షణ ఇవ్వనున్నారు.
'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం - training started for newly appinted rtc employes
మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబసభ్యులకు... ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉద్యోగాలు కల్పించారు. వీరికి బస్‌భవన్‌లో శిక్షణ తరగతులను ఆర్టీసీ ఇన్‌ఛార్జీ ఎండీ సునీల్ శర్మ ప్రారంభించారు.
'ప్రత్యేక' ఆర్టీసీ ఉద్యోగులకు శిక్షణ ప్రారంభం