జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల్లో విధులు నిర్వహించే మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో దాదాపు 45 వేల మంది అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలు, మరో 11 జిల్లాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం చేయనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 45 వేల మంది విధులు నిర్వహించనున్నారు. ఇప్పటికే 431 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ పూర్తి చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
ఈ 45 వేల మంది సిబ్బందిలో 20 వేల మంది పీఓ, ఏపీవోలకు సంబంధిత జిల్లాల్లో ఎన్నికల శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 431 రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక శిక్షణను పూర్తయింది.
ఇదీ చూడండి:వరద బాధితులకు రూ. 664 కోట్ల ఆర్థిక సాయం