వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చినా.. చికిత్స అందక ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. కొవిడ్ బారిన పడిన కడప నగర శివారులోని రామరాజుపల్లెకు చెందిన శంకర్‌రెడ్డి వైద్యం కోసం బుధవారం రాత్రి సర్వజన ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో పడకలు లేవు.. ఖాళీ అయితేకానీ ఇవ్వలేమని అక్కడి సిబ్బంది బదులిచ్చారు.
కుటుంబీకులు సీపీఆర్ చేసినా..
గంట సేపు ఆస్పత్రి వద్దే నిలబడి నిరీక్షించిన శంకర్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే గుండెలపై ఒత్తుతూ సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.