తెలంగాణ

telangana

ETV Bharat / city

Car Drivers in Hyderabad : చలాన్ల భయం కలిగింది.. వాహనదారుల్లో బాధ్యత పెరిగింది! - car accidents in Hyderabad

హైదరాబాద్​లో కారు డ్రైవర్లకు(Car Drivers in Hyderabad) చలాన్ల భయం పట్టుకుంది. ఈ భయం వారిలో బాధ్యతను పెంచింది. ఇంతకుముందు వరకు ట్రాఫిక్ నిబంధనలను తుంగలోతొక్కి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించిన వారంతా.. ఇప్పుడు రూల్స్ పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడుపుతున్నారు. దీని ఫలితమే.. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు జరిగిన ప్రమాదాల్లో మరణాల సంఖ్య 12కు పరిమితమవ్వడం.

Car Drivers in Hyderabad
Car Drivers in Hyderabad

By

Published : Oct 11, 2021, 9:15 AM IST

రాష్ట్ర రాజధానిలో అతి వేగం.. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఈ మార్పు కారు డ్రైవర్ల(Car Drivers in Hyderabad)లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, స్పీడ్‌ లేజర్‌ గన్‌లు వారిపై ప్రభావం చూపుతున్నాయి. సీటు బెల్టు పెట్టుకోకపోతే సీసీ కెమెరాల ద్వారా ఈ-చలాన్‌ వస్తుండటంతో కార్లు నడిపే దాదాపు 90శాతం మందిలో మార్పు వచ్చిందని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదాల సంఖ్య కాస్త తగ్గుతోందని చెబుతున్నారు. ఇటీవల మెట్రో నగరాల్లో ఈ పరిస్థితిపై వారు విశ్లేషించారు. ప్రమాదాల నియంత్రణలో హైదరాబాద్‌ తొలి స్థానంలో ఉందని తేలింది. గతేడాది రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య హైదరాబాద్‌ కమిషరేట్‌ పరిధిలో 237గా గుర్తించారు.

  • నగరంలో నెలకు 150 నుంచి 200 ప్రమాదాలు నమోదవుతున్నాయి. అందులో 20 శాతం కార్ల కారణంగా సంభవించినవి.
  • ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రాఫిక్‌ పోలీసులు స్పీడ్‌ లేజర్‌గన్‌లు, సీసీ కెమెరాలు ప్రధాన ప్రాంతాలతో పాటు జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బాహ్యవలయ రహదారులపై ఏర్పాటు చేయడంతో కారు డ్రైవర్లలో 90శాతం మంది సీట్‌బెల్ట్‌ పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు సీటు బెల్టు పెట్టుకోని వారికి పోలీసులు పంపుతున్న ఈ-చలానాల సగటుతో పోల్చినప్పుడు జూన్‌ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ఈ సరాసరి 60 శాతం తగ్గింది.
  • కారులో ప్రయాణిస్తున్నవారు సీటు బెల్టులు ధరిస్తుండడంతో ఈ ఏడాది సెప్టెంబరు వరకు జరిగిన ప్రమాదాల్లో మరణాల సంఖ్య 12కు పరిమితమైంది. గతేడాది ఈ సంఖ్య 34.

కార్లలో మితిమీరిన వేగంతో వెళ్లేవారు, సీటు బెల్టు ధరించని వారు 12 పాయింట్లు చేరుకుంటే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు లెక్కతో భయపడుతున్నారు. పాయింట్లను వాహదారుడి ఖాతాలోకి పంపించేందుకు మోటార్‌ వాహనచట్టం 28(2)లో 45(ఎ) రూల్‌ను ప్రత్యేకంగా సవరించారు. రహదారులపై తెల్ల గీతలను దాటడం నుంచి, మితిమీరిన వేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, డ్రంకెన్‌ డ్రైవ్‌, హారన్ల మోత, ప్రమాదాల వరకూ వర్గీకరించి ఒక్కో ఉల్లంఘనలకు పాయింట్లను నమోదు చేయనున్నారు. ఒక వాహన చోదకుడు 24 నెలల వ్యవధిలో నిబంధనలు ఉల్లంఘించి 12 పాయింట్లు చేరుకుంటే వెంటనే డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దవుతుంది. రవాణా శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకుని పునరుద్ధరించుకోవాలి.

ఏ ఉల్లంఘనకు ఎన్ని పాయింట్లంటే..

బైక్‌ రేసులు, కారు రేసులు, విన్యాసాలు చేయడం, పరిమితికి మించి వేగంగా నడిపి పోలీసులకు దొరికితే..

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినా, సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడిపినా, కూడళ్ల వద్ద ఇతరులకు ఇబ్బంది కలిగేలా దూసుకెళ్లినా, సిగ్నల్‌ దాటేసినా..

బీమా పత్రాలు లేకుండా వాహనం నడిపినా, ప్రమాదకరమైన వస్తువులు రవాణా చేస్తున్నా..

ఉద్దేశపూర్వకంగా వాహనాలు ఢీకొనడం, మితిమీరిన వేగంతో ప్రమాదాలు చేస్తే..

ABOUT THE AUTHOR

...view details