Traffic restrictions in hyderabad city: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించనున్నారు. ప్రజలు, ప్రయాణికులు తమకు సహకరించాలని పోలీసులు కోరారు. ప్రతి జిల్లా నుంచి ఎన్టీఆర్ స్టేడియానికి 2,300 బస్సుల్లో దాదాపు లక్ష మంది ప్రజానికం వస్తారని ట్రాఫిక్ వారు భావిస్తున్నారు. అందువల్ల నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు.
ఈ తెలంగాణ విమోచన వేడుకలు కారణంగా జరిగే బహిరంగసభకు పెద్దఎత్తున ప్రజలు రావడంతో ఎన్టీఆర్ స్టేడియానికి వెళ్లే మార్గాల్లో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ జోన్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందిరాపార్కు చుట్టూ 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.