సచివాలయ కూల్చివేత సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కొన్ని రహదారులను మూసేశారు. దీని వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం వైపు వెళ్లే మార్గాలన్నింటికీ ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు వేశారు. ఫలితంగా వాహనదారులు ప్రత్యాహ్నయ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఉదయాన్నే విధులకు వెళ్లేవారు, వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు అందరికీ ఈ ఆకస్మిక ఆంక్షలు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నాయి.
ఆంక్షలు ఎప్పుడు సడలిస్తారో చెప్పలేదు..
ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగించనున్నారో ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేయలేదు. ఫలితంగా వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. ప్రధానంగా సచివాలయం నుంచి సికింద్రాబాద్, హిమాయత్ నగర్, సైఫాభాద్, ఖైరతాబాద్, లక్ఢీకాపూల్ తదితర మార్గాల్లో వెళ్లేందుకు ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు.
సచివాలయం కూల్చివేత సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఇవీ చూడండి : 'ఇది చాలా హేయమైన చర్య... సీఎం ఎక్కడున్నారు?'